బోనాలకు రజనీ రెడీ

Elephant Rajani Ready For Bonalu Festival In Hyderabad - Sakshi

చార్మినార్‌: బోనాల జాతర ఉత్సవాల్లో పాల్గొనడానికి రజనీ సిద్ధంగా ఉంది. ఉత్సవాల్లో రజనీ (ఏనుగు)కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా అంబారిపై అమ్మవారి ఊరేగింపును కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో మావటీలు శిక్షణనిస్తున్నారు. నగరంలోని మూడు ప్రతిష్టాత్మకమైన అమ్మవారి దేవాలయాల ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల జాతర ఊరేగింపులో రజినీ పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు 10 ఏళ్లకు పైగా ఎలాంటి అదురు బెదురు లేకుండా అత్యంత ఉత్సాహాంగా బోనాల జాతర ఉత్సవాల్లో రజనీ పాల్గొంటోంది.  

30న ఊరేగింపు
ఈ నెల 30న (సోమవారం) సికింద్రాబాద్‌ ఉజ్జాయినీ మహాంకాళి దేవాలయం అమ్మవారి జాతర ఊరేగింపులో రజనీ పాల్గొంటుంది. ఆగస్టు 5వ తేదీనా బోనాల సమర్పణ రోజు  కార్వాన్‌లోని సబ్జిమండి నల్లపోచమ్మ మహాంకాళి దేవాలయం ఉత్సవాల సందర్భగా నిర్వహించే బోనాల జాతరలో రజనీ ఊరేగింపులో ఉంటుంది. 5న శ్రీ అక్కన్న మాదన్న మహాంకాళి దేవాలయం అమ్మవారి ఘటాల ఊరేగింపు ఉత్సవాల్లో పాల్గొననుంది. ఆరు దశాబ్దాలుగా అంబారీపై అక్కన్న మాదన్న అమ్మవారి ఘటం ఊరేగింపు కొనసాగుతూ వస్తోందని దేవాలయం కమిటి అ«ధ్యక్షులు జి.నిరంజన్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top