'డ్రంకన్ అండ్ డ్రైవర్లు సూసైడ్ బాంబర్లు' | drunk and drivers suicide bombers, says hyderabad CP | Sakshi
Sakshi News home page

'డ్రంకన్ అండ్ డ్రైవర్లు సూసైడ్ బాంబర్లు'

Sep 22 2015 11:25 AM | Updated on Sep 7 2018 4:28 PM

లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే రాందేవగూడ చెక్ పోస్టు వద్ద ప్రమాదం జరిగిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే రాందేవగూడ చెక్ పోస్టు వద్ద ప్రమాదం జరిగిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. దురదృష్టవశాత్తు ఒకరిని కోల్పోయామని, ముగ్గురికి గాయాలయ్యాయని చెప్పారు. డ్రంకన్ అండ్ డ్రైవర్లు సమజానికి సూసైడ్ బాంబర్లు అని వ్యాఖ్యానించారు. గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామని భరోసాయిచ్చారు.

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దేవ్‌గూడలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసు చెక్‌పోస్టుపైకి లారీ దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో రాహుల్ యాదవ్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement