లారీలోనే డ్రైవర్ హఠాన్మరణం | driver suddenly dies in lorry | Sakshi
Sakshi News home page

లారీలోనే డ్రైవర్ హఠాన్మరణం

Jun 6 2015 8:26 PM | Updated on Apr 3 2019 8:07 PM

ఓ లారీ డ్రైవర్ తన సీటులోనే హఠాన్మరణం చెందాడు.

రంగారెడ్డి: ఓ లారీ డ్రైవర్ తన సీటులోనే హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు ప్రాంతానికి చెందిన ఓ లారీని డ్రైవర్ కోకాపేట్ ప్రాంతంలో రోడ్డు ప్రక్కనే ఆపి స్టీరింగ్ పైనే పడిపోయాడు. విషయాన్ని గమనించిన వాహనాదారులు నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరీశీలించే సరికి అతడు మృతి చెంది ఉన్నాడు. మృతుని వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా తమిళనాడులోని బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement