జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న రెండు లారీలు ఢీ కొన్నాయి.
ఆదిలాబాద్ : జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ సంఘటన బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం బోరజ్ గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు..బెంగళూరు నుంచి బోపాల్ వెళ్తున్న లారీ బోరజ్ గ్రామ సమీపంలోని మూల మలుపు వద్ద మరో లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ లారీలో చిక్కుకున్నాడు. దీంతో స్థానికులు అతికష్టం మీద బయటకు తీసుకొచ్చి డ్రైవర్ సోయద్ ను మెరుగైన వైద్యం కోసం రిమ్స్ కు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(జైనత్)