పిచ్చికుక్క స్వైరవిహారం | Dog attacks 17members | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క స్వైరవిహారం

May 30 2015 3:56 PM | Updated on Sep 3 2017 2:57 AM

వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో శనివారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది.

స్టేషన్‌ఘన్‌పూర్ : వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో శనివారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కనపడిన ప్రతి ఒక్కరినీ కరవడం మొదలెట్టింది. శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో పాటు, మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారికి స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు పిచ్చికుక్కలను అదుపు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement