బాలిక కడుపులో వెంట్రుకల ఉండ | Doctors Found Hairball In Girls Stomach In Medak | Sakshi
Sakshi News home page

బాలిక కడుపులో వెంట్రుకల ఉండ

Mar 10 2019 10:53 AM | Updated on Mar 10 2019 10:53 AM

Doctors Found Hairball In Girls Stomach In Medak - Sakshi

బాలిక కడుపులో నుంచి తీసిన వెంట్రుకల ఉండ 

సాక్షి, మెదక్‌జోన్‌: ఓ బాలిక కడుపులో నుంచి సుమారు కిలో వెంట్రుకల ఉండను శస్త్రచికిత్స చేసి వైద్యులు తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాపాన్నపేట మండలానికి చెందిన బాలిక (15) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోయింది. ఇటీవల మెదక్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు శనివారం శస్త్రచికిత్స చేసి బాలిక కడుపులో నుంచి వెంట్రుకల ఉండను బయటికి తీశారు. బాలిక మానసిక ఒత్తిడికి గురై వెంట్రుకలను తినగా అవి కడుపులో ఉండలా తయారయ్యాయని వైద్యుడు చంద్రశేఖర్‌ తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని, ఇలాంటి కేసు జిల్లాలో రావడం ఇదే మొదటిసారని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement