విరాళం సేకరించలేదని.. | do not Collecting donation..... | Sakshi
Sakshi News home page

విరాళం సేకరించలేదని..

Nov 11 2014 2:27 AM | Updated on May 24 2018 1:33 PM

విరాళం సేకరించలేదని.. - Sakshi

విరాళం సేకరించలేదని..

చారిటబుల్ ట్రస్ట్ నిర్వహనకు విరాళం సేకరించలేదని ఓ టీచర్ విద్యార్థిని దండించింది.

విద్యార్థిని దండించిన టీచర్
పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు

 
నల్లగొండ క్రైం : చారిటబుల్ ట్రస్ట్ నిర్వహనకు విరాళం సేకరించలేదని ఓ టీచర్ విద్యార్థిని దండించింది. ఈ ఘటన జిల్లా కేంద్రం శివారు ఎస్‌ఎల్‌బీసీలోని డాన్‌బోస్కో పాఠశాలలో సోమవారం వెలుగుచూసింది. వన్‌టౌన్ సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చారిటబుల్ ట్రస్టు నిర్వహణకు ఫస్ట్‌క్లాస్ చదువుతున్న విద్యార్థి కేతావత్ భార్గవ్‌ను విరాళం సేకరించాలని ఆ పాఠశాల టీచర్ ఆదేశించింది. భార్గవ్ విరాళం సేకరించకపోవడంతో ఆగ్రహించిన టీచర్ అతడి చెంపపై కొట్టడంతో చేతి ఐదు వేళ్ల అచ్చులు పడ్డాయి. దీంతో విద్యార్థి తండ్రి రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

‘డాన్‌బోస్కో’ ఎదుట ఏబీవీపీ  ఆధ్వర్యంలో ధర్నా

నల్లగొండ అర్బన్ : జిల్లా కేంద్రం ఎస్‌ఎల్‌బీసీలోని డాన్‌బోస్కో విద్యాసంస్థ ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆదిశేషు, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు కె.సంతోష్ మాట్లాడుతూ చారిటీపేరుతో విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు అడుగుతున్నారని, ఇవ్వని వారిని వేధించడం, కొట్టడం చేస్తున్నారని ఆరోపించారు. మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో వేణు, సిద్ధు, లింగరాజు, రాహుల్, శ్రీరామ్, సంతోష్ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement