breaking news
Don Bosco
-
ఆ పిల్లల ఆచూకీ దొరికింది
సాక్షి, తిరుమల: హైదరాబాద్ రామాంతాపూర్‌లో డాన్‌బాస్కో నవజీవన్ రిహాబిలిటేషన్ కేంద్రం నుంచి పారిపోయిన 8మంది విద్యార్ధులు ఆచూకీ తిరుమలలో లభ్యమైంది. ఈ నెల 8వ తేదీన విద్యార్థులు పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఘటనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పారిపోయిన పిల్లలు తిరుమలలోని శ్రీవారి పుష్కరిని వద్ద ఉన్నట్టు గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తాము 6వ తేదీనే తిరుమలకు వచ్చినట్టు విద్యార్థులు విజిలెన్స్ అధికారుల విచారణలో వెల్లడించారు. తర్వాత విద్యార్థులను టీటీడీ విజిలెస్స్ సిబ్బంది స్కూల్ యాజమాన్యానికి అప్పగించారు. కాగా, నిర్వాహకుల వేధింపుల కారణంగానే విద్యార్థులు పారిపోయినట్టు వార్తలు వచ్చాయి. -
రె.ఫా. డాక్టర్ భాగ్యయ్య అభిషేక మహోత్సవం
-
విరాళం సేకరించలేదని..
విద్యార్థిని దండించిన టీచర్ పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు నల్లగొండ క్రైం : చారిటబుల్ ట్రస్ట్ నిర్వహనకు విరాళం సేకరించలేదని ఓ టీచర్ విద్యార్థిని దండించింది. ఈ ఘటన జిల్లా కేంద్రం శివారు ఎస్‌ఎల్‌బీసీలోని డాన్‌బోస్కో పాఠశాలలో సోమవారం వెలుగుచూసింది. వన్‌టౌన్ సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చారిటబుల్ ట్రస్టు నిర్వహణకు ఫస్ట్‌క్లాస్ చదువుతున్న విద్యార్థి కేతావత్ భార్గవ్‌ను విరాళం సేకరించాలని ఆ పాఠశాల టీచర్ ఆదేశించింది. భార్గవ్ విరాళం సేకరించకపోవడంతో ఆగ్రహించిన టీచర్ అతడి చెంపపై కొట్టడంతో చేతి ఐదు వేళ్ల అచ్చులు పడ్డాయి. దీంతో విద్యార్థి తండ్రి రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ‘డాన్‌బోస్కో’ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నల్లగొండ అర్బన్ : జిల్లా కేంద్రం ఎస్‌ఎల్‌బీసీలోని డాన్‌బోస్కో విద్యాసంస్థ ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆదిశేషు, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు కె.సంతోష్ మాట్లాడుతూ చారిటీపేరుతో విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు అడుగుతున్నారని, ఇవ్వని వారిని వేధించడం, కొట్టడం చేస్తున్నారని ఆరోపించారు. మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో వేణు, సిద్ధు, లింగరాజు, రాహుల్, శ్రీరామ్, సంతోష్ పాల్గొన్నారు.