'ప్రభుత్వ ప్రకటనలపై ప్రజల్లో గందరగోళం' | dilemma on irrigation projects, says sureshreddy | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వ ప్రకటనలపై ప్రజల్లో గందరగోళం'

Jul 11 2015 4:01 PM | Updated on Mar 18 2019 9:02 PM

'ప్రభుత్వ ప్రకటనలపై ప్రజల్లో గందరగోళం' - Sakshi

'ప్రభుత్వ ప్రకటనలపై ప్రజల్లో గందరగోళం'

సాగునీటి ప్రాజెక్టులపై టీఆర్ఎస్ సర్కార్, ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలపై ప్రజల్లో గందరగోళం నెలకొందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై టీఆర్ఎస్ సర్కార్, ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలపై ప్రజల్లో గందరగోళం నెలకొందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్లో సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పనితీరుపై టీపీసీసీ కమిటీ శనివారం భేటీ అయింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో ప్రాజెక్టులు పూర్తవుతాయో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఇకపై ప్రతినెల అంశాల వారీగా ప్రభుత్వ పనితీరును ప్రజల్లో ఎండగడతామని సురేష్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement