ఒక్క రక్త పరీక్షతో కేన్సర్‌ నిర్ధారణ

Diagnosis of cancer with a single blood test - Sakshi

అందుబాటులోకి సరికొత్త టెక్నాలజీ 

నాసిక్‌లోని దతార్‌ జెనెటిక్స్‌ ఘనత 

‘సాక్షి’కి వివరాలు వెల్లడించిన వినీత్‌ దత్తా 

కేన్సర్‌ మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలెన్నో.. కానీ విజయవంతమైనవి కొన్నే! తొందరగా గుర్తించలేకపోవడం, రోగ నిరోధక శక్తిని ఏమార్చే కేన్సర్‌ కణాలు.. అందుబాటులోని మందుల ప్రభావం ఒక్కొక్కోరిపై ఒక్కొలా ఉండటం.. వందల సంఖ్యలో ఉండే జన్యుమార్పుల ప్రభావం! ఇలా కారణాలు అనేకం! కానీ.. ఈ పరిస్థితి మారిపోతోంది. భారత్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ చేపట్టిన పరిశోధనలు.. త్వరలోనే కేన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చన్న ఆశలు కల్పిస్తున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌: పది మిల్లీ లీటర్ల రక్తం! మీ శరీరంలో కేన్సర్‌ ఉందో లేదో నిర్ధారించుకునేందుకు సరిపోతుంది. విస్తృత స్థాయిలో రక్త పరీక్షలు చేయనక్కర్లేదు. బ యాప్సీ (కణజాలాన్ని కత్తిరించి పరీక్షించడం) చే యాల్సిన పరిస్థితే ఉండదు. ఇదేదో బాగుందే.. ఇం తటి అద్భుతం ఎలా సాధ్యమైందీ అని ప్రశ్నిస్తే.. రక్తంలో ఉండే చిన్న కణాల గుంపు (క్లస్టర్‌) ద్వారా అని సమాధానమిస్తారు దతార్‌ కేన్సర్‌ జెనెటిక్స్‌కు చెందిన వినీత్‌ దత్తా. నాసిక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ కేన్సర్‌ను తొలిదశల్లోనే గుర్తించడంతో పాటు, మెరుగైన చికిత్స మార్గాలను కూడా సూచించే సరికొత్త రక్త పరీక్షను సిద్ధం చేసింది.

రక్తంలో కేన్సర్‌ కణితి అవశేషాల (డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ వంటివి) ఆ ధారంగా వ్యాధిని నిర్ధారించేందుకు ఇప్పటికే లిక్విడ్‌ బయాప్సీ పేరుతో ఒక పద్ధతి అందుబాటులో ఉంది. అయితే అతి తక్కువ సంఖ్యలో ఉండే ఈ అవశే షాలను గుర్తించడం చాలా కష్టం. ‘కణితి నుంచి వి డిపోయిన కణాలు, డీఎన్‌ఏ ముక్కలు, ఆర్‌ఎన్‌ల వంటి అనేక బయో మార్కర్లను గుర్తించడం కష్టం. చాలాసార్లు తప్పుడు ఫలితాలు కూడా చూపిస్తాయి. అందుకే దతార్‌ కేన్సర్‌ జెనెటిక్స్‌ వీటిపై కాకుండా ప్రత్యేకమైన కణాల గుంపు ద్వారా కేన్సర్‌ను నిర్ధారిస్తుంది’అని వినీత్‌ దత్తా ‘సాక్షి’కి తెలిపారు.  

వారంలోనే ఫలితాలు..: ప్రస్తుతం కేన్సర్‌ నిర్ధారణ పరీక్షకు కనీసం నాలుగైదు వారాలు పడుతుంది. దతార్‌ జెనెటిక్స్‌ తయారుచేసిన పరీక్ష ద్వారా వా రంలోనే ఫలితాలు తెలుసుకోవచ్చు. ఏ రకమైన కేన్సర్‌ ఉంది? ఏ రకమైన మందులకు మెరుగ్గా స్పందిస్తుంది? దుష్ప్రభావాలు తక్కువగా ఉండటంతో పాటు మెరుగైన ఫలితాలిచ్చే మందులు వంటివి కూడా ఒకే పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. సుమారు 16 వేల మందితో తాము జరిపిన అధ్యయనంలో 90 శాతం కచ్చితత్వంతో కేన్సర్‌ను నిర్ధారించగలిగామని, ఏ రకమైన కేన్సర్‌ అన్నది 97 శాతం కచ్చితంగా చెప్పగలమని వినీత్‌ తెలిపారు. 

ఖరీదు మాటేమిటి?: కేన్సర్‌ నిర్ధారణ చికిత్సలకు ప్రస్తుతం అవుతున్న వ్యయం చాలా ఎక్కువ. అయితే తాము అభివృద్ధి చేసిన పరీక్ష చాలా చౌకగా అందరికీ అందుబాటులో ఉండేలా ఉంటుందని వినీత్‌ అంటున్నారు. దేశంలో ఏటా లక్షల మంది కేన్సర్‌ బారిన పడుతుండగా చాలామందిలో పరీక్షలు చేయించుకునే స్తోమత ఉండదు. మహిళలకు వచ్చే రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ‘ఈ రక్త పరీక్షలను నగర ప్రాంతాలకే కాక, గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉండేలా చూడాలని నిర్ణయించాం. సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ కాబట్టి ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది’అని వినీత్‌ వి వరించారు. ఈ విషయంలో ఇతర సంస్థలతో కలిసి పనిచేసేందుకు దతార్‌ జెనెటిక్స్‌ సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతానికి తాము రక్త కేన్సర్లను గుర్తించలేమని.. మరిన్ని పరిశోధనల ద్వారా దీన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నా రు. మరిన్ని వివరాల కోసం https:// datarpgx. com/ వెబ్‌సైట్‌ను చూడొచ్చని పేర్కొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top