తెలంగాణలో నేరాలు తగ్గాయి : డీజీపీ

DGP Mahender Reddy Say Crime Rate Decreased In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో నేరాలు 5శాతం తగ్గాయని డీజీపీ మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రజలందరికి సేవలు అందిసుస్తున్నారని తెలిపారు. నేర రహిత తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హత్యలు 4శాతం, ఆస్తి తగాదాలు 8శాతం, మహిళలపై నేరాలు 7శాతం, సైబర్‌ నేరాలు 3శాతం తగ్గాయని చెప్పారు.

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు అదుపుచేస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం జిల్లా కేంద్రాల్లో భరోసా సెంటర్లతో పాటు, రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో షీ టీమ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా 6012 మంది చిన్నారులను తెలంగాణ పోలీసులు కాపాడారని వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 5 లక్షల సీసీ కెమెరాలు అమర్చేలా చర్యలు తీసుకున్నామని డీజీపీ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top