జర్నలిస్టులు పోరాటాలకు సిద్ధం కావాలి: అమర్‌ 

Devulapally Amar Called For The Journalists To Get Ready For The Fight - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్టులు బహుముఖ పోరాటాలకు సిద్ధం కావాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండి యా సభ్యుడు, ఐజేయూ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌ పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్‌లో తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్సŠ(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్‌ అధ్యక్షతన ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అమర్‌ పాల్గొని ప్రసంగించారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో 200కి పైగా జర్నలిస్టులు మృతి చెందారని, వారిలో ఎక్కువ శాతం గుండెపోటుతోనే మరణించారని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందించే రూ.లక్ష ఆర్థిక సహాయం ఏమాత్రం సరిపోదన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకం నీరుగారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో జాతీయ స్థాయి పోరాటాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. టీయూడబ్ల్యూజే సలహాదారు కె. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ విలేకరులు దీనస్థితిలో కుటుంబాలను పోషించుకుంటున్నార ని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుం దని హెచ్చరించారు. ఈ సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి పలు తీర్మానాలు ఆమోదించారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె. విరాహత్‌ అలీ, ఐజే యూ సెక్రటరీ వై.నరేందర్‌ రెడ్డి, కార్యవర్గ సభ్యు డు కె.సత్యనారాయణ, టీయూడబ్ల్యూ జే ఉపాధ్యక్షుడు దొంతు రమేశ్, కోశాధికారి మహిపాల్‌రెడ్డి, కార్యవర్గసభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top