బాసరలో భక్తుడి హఠాన్మరణం | devotee killed due to heart attack in basara temple | Sakshi
Sakshi News home page

బాసరలో భక్తుడి హఠాన్మరణం

Jun 11 2016 3:39 PM | Updated on Sep 4 2017 2:15 AM

బాసరలో భక్తుడి హఠాన్మరణం

బాసరలో భక్తుడి హఠాన్మరణం

ఆదిలాబాద్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు.

బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణానికి చెందిన అవినాష్ (24) శనివారం ఉదయం అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. తర్వాత గుట్టపై ఉన్న వ్యాసుడి గుహ చూసేందుకు వెళుతున్నపుడు గుండెపోటు రావడంతో  ఆకస్మాత్తుగా కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు భక్తుడి మృతిచెందిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని ముధోల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement