డిప్యూటీ సీఎంను అడ్డుకున్న ‘ఏబీవీపీ’ | Deputy CM of the blocking, "ABVP ' | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎంను అడ్డుకున్న ‘ఏబీవీపీ’

Aug 22 2015 2:24 AM | Updated on Sep 3 2017 7:52 AM

డిప్యూటీ సీఎంను అడ్డుకున్న ‘ఏబీవీపీ’

డిప్యూటీ సీఎంను అడ్డుకున్న ‘ఏబీవీపీ’

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్ సమస్య పరిష్కరించాలని కోరు తూ జనగామలో ఏబీవీపీ నాయకులు, ....

జనగామ : పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్ సమస్య పరిష్కరించాలని కోరు తూ జనగామలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని అడ్డుకున్నారు. శుక్రవారం పెంబర్తిలో ‘గ్రామజ్యోతి’ ముగించుకుని హన్మకొం డకు వెళ్తున్న కడియం కాన్వారుుకి ఎదురుగా బైఠారుుంచి నిరసనత తెలిపారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించినా.. నాయకులు వినక పోవడంతో డిప్యూటీ సీఎం కడియం నేరుగా వారి వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకున్నారు. తెలంగా ణ వస్తే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని ఎన్నో కలలు కనాన్మని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సాథం సంపత్ కడియంకు వివరించారు. రీరుుంబర్స్ మెంట్ నిలిచి పోవడంతో 14 లక్షల మంది ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఈబీసీ, వికలాంగులు, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలో ఆపేసే దుస్థితి నెలకొందని అన్నారు.

స్పందించిన కడియం వారం రోజుల్లోగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను విడుదల అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరసన తెలిపిన వారిలో మండల కన్వీనర్ ఉల్లెంగుల మణికంఠ, శాసనబోయిన మహిపాల్, క్రాంతి కుమార్, మహేందర్, సందీప్, శ్రావణ్, రాజు, సంపత్, శ్రీకాంత్, ప్రభు, అశోక్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement