కరోనా కేసుల్లో ‘దియోబంద్‌’ ట్విస్ట్‌.. | Deoband Returnees Gets Coronavirus Positive in Telangana | Sakshi
Sakshi News home page

కరోనా కేసుల్లో ‘దియోబంద్‌’ ట్విస్ట్‌..

Apr 13 2020 10:49 AM | Updated on Apr 13 2020 11:35 AM

Deoband Returnees Gets Coronavirus Positive in Telangana - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించి మరో ట్విస్ట్‌ బయటపడింది. ఇప్పటికే ఢిల్లీలోని మర్కజ్‌ ఘటనతో దేశంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మర్కజ్‌ తరహాలోనే ఉత్తరప్రదేశ్‌లోని దియోబంద్‌కు వెళ్లినవారిలో కొందరికి కూడా కరోనా సోకినట్టుగా తేలింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదైన రెండు కేసులకు దియోబంద్‌కు లింక్‌ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మర్కజ్‌ వెళ్లినవారిలో కొందరు దియోబంద్‌, ఆజ్మీర్‌ దర్గాను కూడా సందర్శించినట్టుగా తెలుస్తోంది. దీంతో యూపీలోని దియోబంద్‌కు హాజరైన వారందరీ ఆచూకీ తెలుసుకునే పనిలో పడ్డారు. మొన్నటివరకు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిని గుర్తించే శ్రమించిన అధికారులు.. ప్రస్తుతం దియోబంద్‌కు వెళ్లినవారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

చదవండి : వైద్యుడిపై ఉమ్మివేసిన కరోనా బాధితుడు

వైర‌ల్‌: డ్రోన్‌తో పాన్ మ‌సాలా డోర్ డెలివరీ

Advertisement
 
Advertisement
Advertisement