లాక్‌డౌన్‌: ‌పాన్ మ‌సాలా డ్రోన్ డెలివ‌రీ | Lockdown: Pan Masala Delivery With Drone In Gujarat | Sakshi
Sakshi News home page

వైర‌ల్‌: డ్రోన్‌తో పాన్ మ‌సాలా డోర్ డెలివరీ

Apr 13 2020 9:17 AM | Updated on Apr 13 2020 10:04 AM

Lockdown: Pan Masala Delivery With Drone In Gujarat - Sakshi

గాంధీన‌గ‌ర్: లాక్‌డౌన్ వ‌ల్ల అన్ని సేవ‌లు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోగా అత్య‌వ‌స‌ర ప‌నుల‌కు మాత్రం దీని నుంచి మిన‌హాయింపు లభించింది. అయితే మా గోడు ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని మందుబాబులు వైన్ షాపుల‌కు క‌న్నాలు పెడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. మ‌రికొందరైతే చుక్క లేక పిచ్చివాళ్ల‌లా ప్ర‌వ‌ర్తిస్తుంటే కొంద‌రు ఏకంగా ఆత్మ‌హ‌త్య‌కు సైతం పాల్పడుతున్నారు. దీంతో వారి బాధ చూడ‌లేక ర‌హ‌స్యంగా మ‌ద్యం బాటిళ్ల‌ను ఎక్కువ రేట్ల‌కు అమ్ముతున్న‌ వ్యాపారుల‌ను కూడా పోలీసులు ప‌ట్టుకుంటున్నారు. ఇదిలావుంటే కొంద‌రు పాన్ మ‌సాలా వేసుకోక నోరు పిడ‌స‌క‌ట్టుకుపోయిందంటూ బాధ‌ప‌డటం ఓ వ్యాపారి కంట్లో ప‌డిన‌ట్లుంది. (అమ్మకానికి పటేల్‌ విగ్రహం..!)

ఇంకేముందీ, వారికి ఎలాగైనా దాన్ని అందించాల‌ని ఆలోచించి అందుకోసం సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించుకున్నాడు. పాన్ మ‌సాలా ప్యాకెట్ల‌ను డ్రోన్ స‌హాయంతో హోమ్ డెలివ‌రీ చేశాడు. ఈ అరుదైన ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని మోర్బిలో జ‌రిగింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. వీడియో ఆధారంగా విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ఇద్ద‌రు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. (ఇటలీ నుంచి దొంగలించారు.. అంతా కాపీ పేస్ట్‌ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement