కరోనా లాక్‌డౌన్‌ : వీధుల్లో సింగర్‌ లైవ్‌ పర్‌ఫార్మెన్స్‌

Corona Lockdown Singer Live Performance Inside Ahmedabad Gated Colony - Sakshi

అహ్మదాబాద్‌ : కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా ​కొద్దిరోజులుగా ఇళ్లకు పరిమితమై ఒత్తిడికి గురవుతున్న జనాలను ఎంటర్‌టైన్‌ చేయటానికి గుజరాత్‌ పోలీసులు ఓ కొత్త పద్దతి ఎంచుకున్నారు. ప్రజల సంతోషంలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్‌ పోలీసులు తమ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రజల్ని ఎంటర్‌టైన్‌ చేయటానికి ఓ లోకల్‌ సింగర్‌ను రంగంలోకి దించారు. డీజే ట్రక్‌తో పాటు వీధి వీధికి తిరుగుతూ అతడితో ప్రదర్శనలు ఇప్పించారు. ఆ సింగర్‌ గిటార్‌ వాయిస్తూ బాలీవుడ్‌ సంగీత దిగ్గజాల ఆల్‌టైమ్‌ రికార్డులతో పాటు లేటెస్ట్‌ పాటలు పాడి అక్కడి ప్రజల్ని ఉర్రూతలూగించాడు. ( పోలీసుల‌ లాఠీ దెబ్బ‌లే కాదు, ఇది కూడా చూడండి )

జనాలు కూడా వారి ఇళ్ల ముందుకు వచ్చి పాటలు వింటూ.. చప్పట్లతో అతన్ని ఉత్సాహపరిచారు. ఓ భవన సముదాయం వద్ద అతడు ప్రదర్శన ఇస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల మంచి తనాన్ని పలువురు నెటిజన్లు కొనియాడుతుంటే.. మరికొందరు మాత్రం దీనిపై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ‘‘ దీన్ని కూడా ఇటలీ నుంచి దొంగలించారు.. అంతా కాపీ పేస్ట్‌’’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయటం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top