మహిళపై డాక్టర్ అత్యాచారయత్నం | dentist rape attempt on women in karimnagar district | Sakshi
Sakshi News home page

మహిళపై డాక్టర్ అత్యాచారయత్నం

Apr 6 2016 12:59 PM | Updated on Jul 28 2018 8:51 PM

క్లీనిక్ పక్కనే ఉన్న ప్రైవేట్ కళాశాలలో అటెండర్‌గా పని చేస్తున్న వివాహితపై కన్నేసిన శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు.

హుజూరాబాద్: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు కళాశాలలో అటెండర్‌గా పని చేస్తున్న మహిళపై ఓ వైద్యుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు.. పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే దంత వైద్యుడు క్లీనిక్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. క్లీనిక్ పక్కనే ఉన్న ప్రైవేట్ కళాశాలలో అటెండర్‌గా పని చేస్తున్న వివాహితపై కన్నేసిన శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ రోజు ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారాయత్నం చేయడానికి యత్నించడంతో.. ఆ మహిళ కేకలు వేయడంతో అక్కడి నుంచి తప్పించుకుంది. తర్వాత పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దంత వైద్యుడు పరారిలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement