తల్లిదండ్రులు చదువు మానుకోమన్నారనే మనస్తాపంతో ఓ డిగ్రీ విద్యారిని ఆత్మహత్య చేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా : తల్లిదండ్రులు చదువు మానుకోమన్నారనే మనస్తాపంతో ఓ డిగ్రీ విద్యారిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
దాడి సౌమ్య(19) అనే విద్యార్థిని స్థానిక డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. తల్లిదండ్రులు గత కొంతకాలంగా చదువు మానుకోమంటున్నారు. దీంతో మనస్తాపంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో సౌమ్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సౌమ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.


