అందోలులో దళిత సంఘాల ఆందోళన | Dalit communities protest in andolu | Sakshi
Sakshi News home page

అందోలులో దళిత సంఘాల ఆందోళన

Mar 14 2016 4:17 PM | Updated on Sep 3 2017 7:44 PM

మెదక్ జిల్లా మనూర్ మండలం ఇరక్‌పల్లి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా అందోలులో సోమవారం దళిత సంఘాల వారు రాస్తారోకో చేపట్టారు.

మెదక్ జిల్లా మనూర్ మండలం ఇరక్‌పల్లి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా అందోలులో సోమవారం దళిత సంఘాల వారు రాస్తారోకో చేపట్టారు. విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులను శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాస్తారోకో కారణంగా రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. సంగారెడ్డి, జోగిపేట వైపు వెళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జోగిపేట ఎస్‌ఐ విజయ్‌రావు ఆందోళన కారులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement