► నెట్‌వర్క్, టెక్నాలజీ, సోషల్ మీడియాలతో పక్కదారి
► దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది ఆన్‌లైన్ వేధింపుల నిందితులు
► ‘ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపుల నియంత్రణ’ సదస్సులో వక్తలు
► సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేస్తాం: హోంమంత్రి నాయిని
సాక్షి, హైదరాబాద్: సెరిలాక్ తినాల్సిన వయసులోనే సెల్‌ఫోన్లు పట్టుకోవడం వల్లే చిన్నారులకు ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులు మొదలయ్యాయని, నెట్‌వర్క్, టెక్నాలజీ, సోషల్ మీడియాతో పక్కదారి పడుతున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. సీఐడీ ఐజీ సౌమ్యా మిశ్రా నేతృత్వంలో గురువారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జరిగిన ‘ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక వేధింపుల నియంత్రణ’ సదస్సును హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారం భించారు.
టెక్నాలజీ, సోషల్ మీడియాలను సరైన రీతిలో ఉపయోగించుకోకపోవడం వల్లే చిన్నారులు, మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చిన్నారు లపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, సైబర్ నేరస్థులను కట్టడి చేయడంలో సీఐడీ సఫలీకృతమవుతోందని నాయిని ప్రసంశిం చారు. ఈ సందర్భంగా సీఐడీ రూపొందించిన లైంగిక వేధింపుల నియంత్రణ మాడ్యుల్‌ను ఆవిష్కరించారు.
తల్లిదండ్రుల పర్యవేక్షణలో నియంత్రణ
పోలీసులు, చట్టాలు, స్వచ్ఛంద సంస్థలు.. ఇలా ఎన్ని ఉన్నా పిల్లలపై జరుగుతున్న లైం గిక వేధింపుల నియంత్రణలో కీలక పాత్ర తల్లి దండ్రులదేనని తులిర్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యారెడ్డి స్పష్టంచేశారు. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో తాము చేసిన సర్వే ప్రకారం సెక్సువల్ ఎడ్యు కేషన్ పాఠ్యాంశంగా ఉందని, అయితే దేశంలో ఇప్పుడిప్పుడే ఈ అంశంగా చేర్చే ప్రక్రియ ప్రారంభంలో ఉందన్నారు. బిహార్‌లోని పట్నా రైల్వేస్టేషన్‌లో ఉచితంగా వైఫై ఇవ్వడంతో చాలా మంది అశ్లీల చిత్రాలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసినట్లు అక్కడి పోలీసుల దర్యా ప్తులో బయటపడిందన్నారు.
దీంతో అక్కడ వైఫై సేవలు రద్దు చేశారన్నారు. పోర్న్ వెబ్ సైట్లు, సంబంధిత సోషల్ మీడియాను వీక్షిం చవద్దని తెచ్చే ఒత్తిడి వల్ల పిల్లల్లో మానసిక వేదన ప్రారంభమై, వాటిని చూసేలా ప్రేరేపి స్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. అలాంటి వెబ్‌సైట్లు వీక్షించడం వల్ల వచ్చే ప్రమాదాలను తెలపడం, అవగాహన కల్పించడం వల్ల, పిల్లల్లో స్వీయ నియంత్రణ అలవ డుతుందని తెలిపారు. ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే పిల్లలకు ఇలాంటి విషయాల్లో అవగాహన కల్పించ గలరని పేర్కొన్నారు.
సెరిలాక్ వయసులోనే.. సెల్‌ఫోన్లా!
Published Fri, Mar 17 2017 3:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్‌లు!
Advertisement