అప్పుల బాధతో కౌలు రైతు మృతి | Crops ruined, debt- ridden farmer dies | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో కౌలు రైతు మృతి

Jan 26 2015 8:25 PM | Updated on Oct 1 2018 4:01 PM

కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన సల్వాల నాంపెల్లి(45) అనే కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన సల్వాల నాంపెల్లి(45) అనే కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నాంపెల్లి గల్ఫ్ వెళ్లడానికి చేసిన అప్పుతో పాటు చిన్న కొడుకు నరేశ్‌ను రూ.లక్ష అప్పు చేసి గల్ఫ్‌కు పంపాడు. గల్ఫ్‌లో సరైన పనులు లేక కొడుకు ఇంటికి డబ్బులు పంపలేకపోయాడు. దీనికితోడు కుటుంబ పోషణ భారంగా మారడంతో పూట గడవడం కోసం మరిన్ని అప్పులు చేశాడు.

ఎకరం పొలం కౌలుకు తీసుకొని పత్తిపంట సాగు చేశాడు. రెండేళ్లుగా పంట దిగుబడి రాక నిరాశే ఎదురైంది. ఫలితంగా రూ.3లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. దీంతో మనస్తాపం చెందిన నాంపెల్లి సోమవారం ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement