సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చాడ | CPI National Executive Member chada venkatreddy second time | Sakshi
Sakshi News home page

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చాడ

Apr 30 2018 4:52 AM | Updated on Apr 30 2018 4:52 AM

CPI National Executive Member chada venkatreddy second time - Sakshi

హుస్నాబాద్‌ (సిద్దిపేట): సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చాడ వెంకట్‌రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. కేరళ రాష్ట్రంలోని కొల్లంలో సీపీఐ 23వ జాతీయ మహాసభలు ఈ నెల 25 నుంచి 29 వరకు నిర్వహించారు. ఈ మహాసభల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నిక కావడం ఇది రెండోసారి.

2014లో మొదటిసారిగా చాడ వెంకట్‌రెడ్డిని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 2018 ఏప్రిల్‌ 1 నుంచి 4 వరకు హైదరాబాద్‌లో జరిగిన సీపీఐ మహాసభల్లో తిరిగి రెండోసారి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. చాడ వెంకట్‌రెడ్డి ఎన్నికపై సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు గడిపె మల్లేశ్, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు బద్దిపడిగ రాజిరెడ్డి, గురాల హన్మిరెడ్డి, ఎనగందుల లక్ష్మీనారాయణ, నాయకులు దుర్గేశం, పొదిల కుమారస్వామి, మాడిశెట్టి శ్రీధర్, సంజీవరెడ్డి, రాంరెడ్డి, మల్లారెడ్డి, రాజ్‌కుమార్, కర్ణకంటి నరేష్‌లు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement