ఆర్టికల్‌ 370 రద్దు: రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌

CP Mahesh Bhagwat High Alert In State Over Article 370 Scrapped - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోని పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్రం ఆదేశించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని మహేందర్‌రెడ్డి తెలిపారు.

కేంద్ర హోం మంత్రిత్వశాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని సీపీ సజ్జనార్‌ తెలిపారు. సభలు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top