విమానాశ్రయంలో పది అంబులెన్స్‌లు 

Covid 19: Ten 108 Ambulances For Suspects At RGIA Shamshabad - Sakshi

రోజుకు రెండు వేల నుంచి 2500 మందికి

థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు 

హైదరాబాద్‌: వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తప్పనిసరి 14 రోజుల క్వారంటైన్‌కు తరలిస్తుండటంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 10 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. విమానాశ్ర యంలో ప్రతిరోజు 2వేల నుంచి 2,500 మంది ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో కరోనా అనుమానిత లక్షణాలు కనిపిం చిన వారితో పాటు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ఇస్తు న్న ప్రయాణికులకు నగరంలోని గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మిగతా వారిని వికారాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు.  

విమానాలు భారీగా రద్దు.. 
కొన్ని రోజులుగా ఆయా దేశాల ఆంక్షలతో పాటు ప్రయాణికులు కూడా రాకపోకలకు రద్దు చేసుకుంటుండటంతో అంతర్జాతీయ ట్రాఫిక్‌తో పా టు, దేశీయ ట్రాఫిక్‌ కూడా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్‌ ప్రభావంతో బుధవారం నాలుగు అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు 25 దేశీ య విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాల్లో ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో పలు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు, ఢిల్లీ, కొచ్చిన్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను రద్దు చేశాయి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top