‘మా ఇంటి బిడ్డ(కేసీఆర్‌) పైసలు పంపిండు’

CoronaCrisis: Telangana Govt Credited RS 1500 White Ration Card Holders Account - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: మహమ్మారి కరోనా వైరస్‌ పేదల పొట్ట కొట్టింది. రోజువారి కూలి పనులకు వెళ్లేవారికి కష్టాలు రెండింతలయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి రానివ్వని సీఎం కేసీఆర్‌ ధృఢసంకల్పానికి పూనారు. ఈ ఆపత్కాలంలో పేదవారి కడుపులు నింపడంతో పాటు వారికి ఆర్థికంగా చేయూతనందించాలని నిశ్చయించుకున్నారు. రేషన్‌ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి రూ. 1500 చొప్పున ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం ఈ డబ్బు అర్హుల అకౌంట్లలో జమయ్యాయి. దీంతో ప్రజల ముఖాలపై చిరునవ్వు వెల్లివిరిసింది.

చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో రూ.1500 ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ కమ్రంలో సంగారెడ్డికి చెందిన శివరాజ్‌ బ్యాంకుకు వచ్చి తన అకౌంట్లో జమయిన డబ్బులను తీసుకున్నారు. అనంతరం ఆ నోట్లను లెక్కపెట్టుకుంటూ మురిసిపోతున్న శివరాజ్‌ను ‘సాక్షి’ తన కెమెరాతో క్లిక్‌ అనిపించింది. ఎన్నికల ప్రచారంలో ప్రతీ పేదవాడి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాన​న్న కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం కష్ట కాలంలో పైసలు పంపి కొడుకు బాధ్యతను నిర్వర్తించాడని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి:
కువైట్‌ అత్యవసర క్షమాభిక్ష
20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top