కన్నతల్లి కడచూపునకు నోచుకోక..

Constable Gouri Naidu Did Not Attend For His Mother Burial Due To Lockdown - Sakshi

విధుల్లోనే ఉండిపోయిన ఓ కానిస్టేబుల్‌

మేడిపల్లి: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ మిగిలిస్తున్న కన్నీటి గాథలెన్నో.. జన్మనిచ్చిన అమ్మ ఇక లేదని తెలిసినా, కన్నతల్లి కడచూపునైనా నోచుకోనివ్వని బా ధ్యతలు ఆ కానిస్టేబుల్‌నే కాదు మిగతా సి బ్బందినీ కంట తడిపెట్టించాయి. కానిస్టేబుల్‌ గౌరీనాయుడు మేడిపల్లి ఠాణా పరిధిలో లాక్‌డౌన్‌ విధులు నిర్వర్తిస్తున్నాడు. తల్లి ఎల్లమ్మ (48) విజయనగరం జిల్లా వెట్టిపల్లిలో అనారోగ్యంతో శనివారం మృతి చెందినట్టు సమాచారం అందింది. లాక్‌డౌ న్‌తో రాష్ట్ర సరిహద్దులు మూసుకుపోవడంతో తన తల్లిని కడసారి చూ సుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆదివారం తల్లి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన గౌరీనాయుడు గుండెదిటవు చేసుకు ని బాధ్యతలు నిర్వర్తించాడు. విషయం తెలిసిన సహోద్యోగులు అతడిని ఓదార్చి సంఘీభావం తెలిపారు. సీఐలు అంజిరెడ్డి, యద్బాల్‌ జానీ, ఎస్‌ఐ రఘురామ్‌ కానిస్టేబుల్‌ను పరామర్శించి ఓదార్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top