'పొన్నాల నా టికెట్ అమ్ముకున్నాడు' | Congress rebel candidate Madhava Reddy takes on Ponnala Lakshmaiah | Sakshi
Sakshi News home page

'పొన్నాల నా టికెట్ అమ్ముకున్నాడు'

Apr 12 2014 4:55 PM | Updated on Mar 18 2019 7:55 PM

తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కుట్రపూరింతగా వ్యవహరించి తనకు వచ్చిన టికెట్ను వేరొకరికి అమ్ముకున్నారని నర్సంపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మాధవ్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కుట్రపూరింతగా వ్యవహరించి తనకు వచ్చిన టికెట్ను వేరొకరికి అమ్ముకున్నారని నర్సంపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మాధవ్ రెడ్డి ఆరోపించారు. శనివారం వరంగల్లో మాధవ్ రెడ్డి మాట్లాడుతూ... పొన్నాల చర్యల వల్ల తాను తీవ్ర మనస్థాపం చెందినట్లు చెప్పారు. అందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నర్సంపేటలో తన నామినేషన్ ఉపసంహరించుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. తన గెలుపుతో పొన్నాలకు బుద్ది చెప్తానని మాధవ్ రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement