రైతు రుణమాఫీ అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
హైదరాబాద్ : రైతు రుణమాఫీ అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనందున వాకౌట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా లక్ష లోపు రుణాలు మాఫీ చేయాలని కోరితే... అనువాదంలో తప్పు జరిగిందని తప్పించుకున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మండిపడ్డారు.