నాకు ఎలాంటి నోటీసులు అందలేదు: కోమటిరెడ్డి  | Congress Leader Komatireddy Venkat Reddy Slams TRS | Sakshi
Sakshi News home page

నాకు ఎలాంటి నోటీసులు అందలేదు: కోమటిరెడ్డి 

Aug 25 2019 8:27 PM | Updated on Aug 25 2019 8:39 PM

Congress Leader Komatireddy Venkat Reddy Slams TRS - Sakshi

తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు..

సాక్షి, నల్గొండ : ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంలలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధనకై సోమవారంనుంచి పాదయాత్ర చేస్తానని భువనగరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ ఎస్పీ రంగనాధ్ నోటీసులు జారీ చేశారు. పాదయాత్రకు పోలీసు బందోబస్తు ఇవ్వలేమని నోటీసులో ఎస్పీ స్పష్టం చేశారు. పాదయాత్రకు అనుమతి నిరాకరించటంపై కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఇంతవరకు పాదయాత్రపై ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. పాదయాత్రను అణిచి వేయడాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనంగా పేర్కొన్నారు. తన స్వేచ్ఛను హరించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. హైకోర్ట్ నుంచి అనుమతి తీసుకొచ్చయినా పాదయాత్ర చేసి తీరుతానని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement