సౌదీ మహిళకు కలెక్టర్‌ సహాయం

Collector Sweta Mohanty Helps Saudi Arabia Women In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకున్న సౌదీ అరేబియాకు చెందిన ఓ మహిళ తిరిగి స్వదేశం వెళ్లేందుకు హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి సహకరించారు. సౌదీ అరేబియాకు చెందిన 54 ఏళ్ల ముస్లిం మహిళ తమ బంధువుల్ని కలిసేందుకు జనవరి 31న హైదరాబాద్‌కు వచ్చారు. ఏప్రిల్‌ 17న ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేందుకు సౌదీ ఎయిర్‌లైన్స్‌ ద్వారా అడ్వాన్స్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నారు. కాగా, కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్‌ కావడంతో  ఆమె తిరిగి వెళ్లేందుకు వీలు కాలేదు. (ఇంటి అద్దె రద్దు చేసిన వైద్యుడు)

లాక్‌డౌన్‌ సడలించడంతో తిరిగి వెళ్లేందుకు కోవిడ్‌ పరీక్షలు, క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ అవసరమైంది. హైదరాబాద్‌లోని రాయల్‌ కాన్సులేట్‌ ప్రతినిధి, న్యాయవాది మహమ్మద్‌ ఉస్మాన్‌ స్పందించి..ఆ మహిళ తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు సత్వర పరీక్షల కోసం సహకరించాలని ఈ–మెయిల్‌ ద్వారా కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్‌ వెంటనే ఆ మహిళకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్‌ జారీ చేసే విధంగా వైద్యశాఖ అధికారులకు ఆదేశించారు.  ఈ మేరకు వైద్యాధికారులు తక్షణం స్పందించడంతో ఒక్క రోజులోనే సదరు మహిళకు పరీక్షలు పూర్తి కావడంతో పాటు నివేదిక అందుకుంది. పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో తిరిగి సౌదీ వెళ్లేందుకు క్లియరెన్స్‌ లభించింది. దీంతో ఆమె సోమవారం ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి సౌదీకి ప్రయాణమైంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మేడం చాలా మంచివారు అంటూ సౌదీ మహిళ పేర్కొంది.(గ్రేటర్‌పై కరోనా పంజా)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top