‘యాదాద్రి’కి త్వరలో సీఎం రాక..?

CM KCR To Visit Yadadri Temple - Sakshi

సుదర్శన హోమం, ఆలయ ప్రారంభోత్సవాలపై చర్చ

ఇప్పటికే 90శాతం మేర ఆలయ అభివృద్ధి పనులు పూర్తి

మిగిలిన పనుల పూర్తికి కూడా వేగవంతంగా చర్యలు

సాక్షి, యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ త్వరలో యాదాద్రికి రానున్నట్టు తెలిసింది. చినజీయర్‌ స్వామితో కలిసి గుట్టను సందర్శించే సీఎం కేసీఆర్‌ అభివృద్ధి పనులు ఎంత మేరకు పూర్తయ్యాయి, సుదర్శన హోమం, ఆలయ ప్రారంభం తదితర అంశాలను చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే చినజీయర్‌ స్వామికి ఉన్న బిజీ షెడ్యూల్‌ కారణంగా తేదీలు ఖరారు చేసుకుని వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. యాదాద్రి ఆలయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్న విషయం విధితమే. సీఎం కేసీఆర్‌ మాత్రం చినజీయర్‌స్వామిని కలుసుకుని వీటిపై చర్చలు జరిపిన అనంతరమే ముహూరం ఖరారు చేయనున్నట్టు సమాచారం.

పనులు వేగిరం
సీఎం కేసీఆర్‌ యాదాద్రికొండను సందర్శించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పనులను వేగి రం చేశారు.  యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతం మేర పూర్తయ్యాయి. మి గిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేం దుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పాత వైకుంఠద్వారం తొలగించి నూతనంగా నిర్మాణం చేశారు. అదే విధంగా భక్తులు కొండపైకి వెళ్లడానికి అనుగుణంగా నూ తన మెట్ల దారిని కూడా ఏర్పాటు చేశారు.వాటి పనులు  కూడా త్వరలో పూర్తి కానున్నాయి.  అంతేకాదు గ ర్భాలయంలో కూడా  వైటీడీఏ  వైస్‌  చైర్మెన్‌ కిషన్‌రా వుతో పాటు అధికారులు జరుగుతున్న పనులపై ఎ ప్పటికప్పుడు సమీక్షలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.

త్వరలో చినజీయర్‌ స్వామితో సీఎం సమావేశం
యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవంపై సీఎం కేసీఆర్‌ త్వరలో చినజీయర్‌స్వామిని కలుసుకోనున్నట్టు తెలిసింది. ఫిబ్రవరిలో ఆలయ ప్రారంభోత్సవం, 1008 హోమగుండాలతో సుదర్శనహోమం, అదే విధంగా వీఐపీ సూట్స్‌ వంటి ప్రారంభోత్సవాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్టు సమాచారం. కాగా, సుదర్శనహోమాన్ని నిర్వహించేందుకు వేదపండితులు ఎవరిని పిలవాలి అనే అంశంపై కూడా ప్రధానంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీటన్నింటిపై ఓ సమగ్ర నివేదిక పొందుపర్చుకున్న తర్వాతనే సీఎం వీలుంటే చినజీయర్‌స్వామితో కలిసి ఆలయాన్ని సందర్శిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top