జయశంకర్‌ కృషిని తెలంగాణ మర్చిపోదు  | CM KCR Says Telangana Will Never Forget Professor Jayashankar In Hyderabad | Sakshi
Sakshi News home page

జయశంకర్‌ కృషిని తెలంగాణ మర్చిపోదు 

Jun 22 2020 2:01 AM | Updated on Jun 22 2020 2:01 AM

CM KCR Says Telangana Will Never Forget Professor Jayashankar In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన కృషిని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆదివారం జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. తెలంగాణ భావజాల ప్రచారం కోసం జయశంకర్‌ చేసిన  కృషిని భవిష్యత్‌ తరాలు గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

జయశంకర్‌కు టీఆర్‌ఎస్‌ నేతల నివాళి 
ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన అందించిన సేవలు గుర్తుచేసుకుని టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జయశంకర్‌ విగ్రహానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, వి.ప్రకాశ్, ఇతర నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించా రు. మంత్రుల నివాస ప్రాంగణంలో అబ్కారీ, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ వినోద్‌కుమార్, ఇతర మంత్రులు తమ జిల్లాలు, నివాసాల వద్ద జయశంకర్‌కు నివాళులర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement