మిషన్ భగీరథపై కేసీఆర్ సమీక్ష | cm kcr reviews on Mission bhagiratha project | Sakshi
Sakshi News home page

మిషన్ భగీరథపై కేసీఆర్ సమీక్ష

Jan 24 2017 4:22 PM | Updated on Aug 14 2018 11:02 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం మిషన్ భగీరథ పథకంపై సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం మిషన్ భగీరథ పథకంపై సమీక్ష నిర్వహించారు. సెగ్మెంట్ల వారీగా వాటర్ గ్రిడ్‌ పనుల పురోగతిని కేసీఆర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథకు అవసరమైన విద్యుత్ పనులను సమాంతరంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే పనుల వేగం పెంచి గడువులోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి సహకారం అవసరమైన రైల్వే, జాతీయ రహదారుల క్రాసింగ్లను త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement