అవార్డు గ్రహీతలకు కేసీఆర్‌ అభినందనలు | CM congratulated and expressed happiness over vaasala narsaiah, Mercy Margaret winning Sahitya Akademi Yuva Puraskar | Sakshi
Sakshi News home page

అవార్డు గ్రహీతలకు కేసీఆర్‌ అభినందనలు

Jun 23 2017 4:00 PM | Updated on Aug 15 2018 9:40 PM

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతలకు సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.

హైదరాబాద్‌ : కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. మెర్సీ మార్గరేట్‌, వాసాల నర్సయ్యను ఆయన ప్రశంసించారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2017  ప్రకటించిన యువ రచయితలకు తెలుగులో ”మాటల మడుగు” పద్య సాహిత్యం రాసిన మెర్సీ మార్గరేట్‌ ఎంపిక అయ్యారు.

అలాగే  పాటు జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన వాసాల నర్సయ్య బాల సాహిత్య పురస్కారానికి ఎన్నికైన విషయం విదితమే. పురస్కార విజేతలు... రాగి ఫలకం, ప్రశంసా పత్రం, రూ.50వేల నగదు అందుకోనున్నారు. మొత్తం 24 భాషల్లో 35 ఏళ్ల లోపు యువ రచయితలకు సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. నవంబర్‌ 14న విజేతలకు సాహిత్య అకాడమీ పురస్కారాలను అందజేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement