ఖమ్మంలో డిగ్రీ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌ | Classmates gangrape student in Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో డిగ్రీ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌

Jul 3 2017 9:27 PM | Updated on Sep 5 2017 3:06 PM

ఖమ్మంలో డిగ్రీ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌

ఖమ్మంలో డిగ్రీ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌

జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు.

ఖమ్మం: జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. బీ.కాం సెకండియర్‌ చదువుతున్న తోటి విద్యార్థినిని బర్త్‌ డే పార్టీకి ఆహ్వానించిన నలుగురు విద్యార్థులు ఆమెపై గ్యాంగ్‌రేప్‌ పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా వీడియో తీసి బయటకు చెబితే నెట్‌లో పెడతామని బెదిరించారు. ఇంటికి చేరుకున్న తర్వాత తల్లిదండ్రులతో జరిగిన దారుణాన్ని చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో విద్యార్థి కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లినట్లు భావిస్తున్నారు. అత్యాచారానికి గురైన బాలిక దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన విద్యార్థులు అందరూ మైనర్లు కావడంతో పోలీసులు కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement