రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి | Child killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

Jan 21 2016 12:35 PM | Updated on Aug 30 2018 3:58 PM

రోడ్డు దాటుతున్న తల్లి, కూతురును లారీ ఢీకొట్టిన ఘటనలో కూతురు చనిపోగా తల్లి తీవ్రంగా గాయపడింది.

రోడ్డు దాటుతున్న తల్లి, కూతురును లారీ ఢీకొట్టిన ఘటనలో కూతురు చనిపోగా తల్లి తీవ్రంగా గాయపడింది. తాండూరు శివారులోని పాలిషింగ్ యూనిట్‌లో పనిచేసే సునీత(30), ఆమె కూతురు స్వప్న(5) గురువారం మధ్యాహ్నం రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో స్వప్న అక్కడికక్కడే చనిపోగా సునీత తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని తాండూరు ఆస్పత్రికి అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు కారణమైన లారీని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement