మాజీ ఎమ్మెల్యే ‘గండ్ర’పై చీటింగ్‌ కేసు నమోదు | Cheating case registered on Gandra Venkataramana Reddy | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే ‘గండ్ర’పై చీటింగ్‌ కేసు నమోదు

Aug 6 2018 2:09 AM | Updated on Aug 6 2018 2:09 AM

Cheating case registered on Gandra Venkataramana Reddy - Sakshi

కాజీపేట అర్బన్‌: ఓ మహిళను మోసం చేశాడన్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై వరంగల్‌లోని సుబేదారి పోలీసులు ఆదివారం చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సదయ్య, బాధితురాలు విజయలక్ష్మి కథనం ప్రకారం.. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన విజయలక్ష్మి ఎనిమిదేళ్ల క్రితం హన్మకొండలో మదర్‌ ఫౌండేషన్‌ పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఈ క్రమంలో పరిచయమైన మాజీ ఎమ్మెల్యే గండ్రతో సాన్నిహిత్యం పెరిగింది.

కాగా, నాలుగేళ్లుగా తనతో అవసరాలను తీర్చుకుని తనను దూరం చేసే కుట్రలో భాగంగా అసత్య ఆరోపణలు చేస్తు సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో తనపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో తనను చంపే ప్రయత్నం చేస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డిపై నిర్భయ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయన నివాసంవద్ద ధర్నా చేపట్టింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు గండ్రపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. కాగా ఈ ఘటనపై వెంకటరమణారెడ్డి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తనపై ఆమె అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement