17 నుంచి సభాపతుల సదస్సు

Chapel Conference From 17th Of December - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత చట్ట సభల అధ్యక్షులు, సభాపతులు, ఉపాధ్యక్షులు, ఉప సభాపతులు, శాసన మండలి కార్యదర్శుల సదస్సు ఈ నెల 17 నుంచి 20 వరకు ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో జరగనుంది. ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల చట్ట సభల కార్యదర్శులు సమావేశమై చట్ట సభల్లో అమర్యాదగా వాడే పదాల తొలగింపుపై ప్రస్తుత నిబంధనల ను సమీక్షించడంతోపాటు చట్ట సభలను ప్రజానీకానికి దగ్గర చేయడానికి మార్గాలను అన్వేషించనున్నారని శాసన మండలి కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌–స్పీకర్ల పాత్ర అంశంతో పాటు చట్ట సభల ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు 18న జరిగే సమావేశంలో చర్చిస్తారు. 19న జరిగే సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల చట్ట సభల్లో ఒకే విధమైన పార్లమెంటరీ నిబంధనలను రూపొందించడం, చట్ట సభల్లో ఎదురవుతున్న సమస్యలు వంటి అంశాలపై చర్చిస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top