కార్మిక చట్టాల మార్పులను ఉపసంహరించుకోవాలి:దాస్‌గుప్తా | Changes in labor laws and reiterated, demands Gurudas Dasgupta | Sakshi
Sakshi News home page

కార్మిక చట్టాల మార్పులను ఉపసంహరించుకోవాలి:దాస్‌గుప్తా

Nov 1 2014 2:12 AM | Updated on Sep 2 2017 3:39 PM

శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద ఏఐటీయూసీ సభలో మాట్లాడుతున్న దాస్ గుప్తా

శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద ఏఐటీయూసీ సభలో మాట్లాడుతున్న దాస్ గుప్తా

కార్మిక చట్టాల్లో మార్పులు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్‌గుప్తా అన్నారు.

ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్‌గుప్తా
 
 సాక్షి, హైదరాబాద్:  కార్మిక చట్టాల్లో మార్పులు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్‌గుప్తా అన్నారు. ఏఐటీయూసీ 95వ వార్షికోత్సవ కార్మిక బహిరంగ సభ శుక్రవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో జరిగింది. ఈ సందర్భంగా హాజరైన గుప్తా మాట్లాడుతూ.. కేంద్రం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమాలను తీవ్రతరం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
 
 మోదీ ప్రభుత్వం రక్షణ, ఎల్లైసీ, బ్యాంకు, రైల్వే వంటి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26 శాతం నుంచి 46 శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ తెలంగాణ అధ్యక్షులు నరసింహన్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, నేతలు ఓబులేషు, పీజే చంద్రశేఖర్‌రావు, మహాదేవన్, డాక్టర్ బీవీ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది కార్మికులు సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకూ ఎర్రచొక్కాలు ధరించి కవాతు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement