వనస్థలిపురం ఆటోనగర్లో చైన్‌స్నాచింగ్కు యత్నం, పోలీసుల కాల్పుల ఘటన చోటుచేసుకున్న కొద్ది సమయానికే నగరంలోని మరో చోట చైన్ స్నాచింగ్ జరిగింది.
హైదరాబాద్ : వనస్థలిపురం ఆటోనగర్లో చైన్‌స్నాచింగ్కు యత్నం, పోలీసుల కాల్పుల ఘటన చోటుచేసుకున్న కొద్ది సమయానికే నగరంలోని మరో చోట చైన్ స్నాచింగ్ జరిగింది. సరూర్‌నగర్ పరిధిలోని కొత్తపేట హుడా కాంప్లెక్స్ వద్ద సోమవారం మధ్యాహ్నం సుమతి అనే మహిళ మెడలో బంగారు గొలుసును దొంగలు ఎత్తుకెళ్లారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.