రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని గొలుసును బైకుపై వచ్చిన ఆగంతకులు తెంచుకుని పారిపోయిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
చైతన్యపురి : రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని గొలుసును బైకుపై వచ్చిన ఆగంతకులు తెంచుకుని పారిపోయిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఐ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం... శేరిలింగంపల్లి సుదర్శన నగర్‌కు చెందిన ఎం.భారతి గురువారం మధ్యాహ్నం సరూర్‌నగర్ పంజాల అనిల్‌కుమార్‌కాలనీలో ఉండే కూతురు సునీత ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో కొత్తపేటలో బస్సు దిగి షేరింగ్ ఆటోలో కూతురు ఉండే కాలనీ వద్ద దిగి నడుచుకుంటూ వెళుతోంది.
అదే సమయంలో వెనుక నుంచి పల్సర్ బైకుపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆమె మెడలోని 2తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆగంతకులలో ఒకరు ముఖానికి మాస్కు వేసుకుని క్యాప్ పెట్టుకుని ఉన్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.