తెలంగాణలో నిరంకుశ పాలన

దేవరకద్ర :  తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నిరంకుశ పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు ఆందోళన చేయడానికి కూడా వీలులేని పరిస్థితులను కల్పిస్తూ అణచివేసే ధోరణికి పాల్పడుతున్నారని విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక తెలంగాణ పోరుబాట బస్సుయాత్ర మంగళవారం దేవరకద్రకు చేరింది. ఈ సందర్బంగా కొత్తబస్టాండ్‌ చౌరస్తాలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తన ఒక్కడి వల్లనే తెలంగాణ వచ్చిందనే అహంభావంతో కేసీఆర్‌ మాట్లాడు తున్నారని అన్నారు. వాస్తవానికి 1200మంది విద్యార్థులు, నిరుద్యోగులు ప్రాణత్యాగాలు చేశారని, నాలుగున్నర కోట్ల ప్రజలు పోరాడారని అన్నారు. తెలంగాణలో దొరల పాలన, కుటుంబ పాలన సాగుతున్నదని ఆరోపించారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తా నని ఎన్నికలకు ముందు చెప్పిన కేసీఆర్‌ మాటతప్పాడ ని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఎక్కడా ఇవ్వడం లేదన్నారు.  పీసీసీ సభ్యులు కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ డోకూర్‌ పవన్‌కుమార్‌రెడ్డి, సీపీఐ డివిజన్‌ కార్యదర్శి దేవదాసు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు రాందాసు, సీపీఐ రాష్ట్ర నాయకులు బాలమల్లేశ్, పద్మ, మహ్మద్‌యూసఫ్, పాండురంగాచారి, సృజన, రాములు, రమావత్‌ అంజ య్య, లక్ష్మీనారాయణ పల్లె నరసింహా, నల్లా శ్రావణి పాల్గొన్నారు.   

అభివృద్దికి నోచుకోని తెలంగాణ
జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి నోచుకోవడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌లోని అల్‌మాస్‌ ఫంక్షన్‌హాల్‌లో ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పద్మ, నర్సింçహ, ఆదిరెడ్డి,బాల్‌మల్లేష్, రామకృష్ణ, సురేష్‌ పాల్గొన్నారు.
 
సామాజిక తెలంగాణ కోసమే...   
మరికల్‌: సామాజిక తెలంగాణ కోసమే సీపీఐ ఆధ్వర్యం లో పోరుబాట చేపడుతున్నామని జరిగిందని చాడ వెం కట్‌రెడ్డి అన్నారు. యాత్ర మరికల్‌కు చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు ఘనంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షు డు వీరబసంత్, కృష్ణయ్య, బాలకిష్ణ, టంకరశ్రీను, కృష్ణ య్య, గోపి, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

‘ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌’   
మక్తల్‌: మక్తల్‌లోని అంబేద్కర్‌చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చాడ మాట్లాడారు. పోరుబాట కార్యక్రమానికి ప్రజల నుంచి మంచిస్పందన వస్తోందని అన్నారు. అన్నిపక్షాల నాయకులు సహకరిస్తున్నారని అన్నారు. ఏఐటీయూసీ నాయకుడు కొండ న్న అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు నారాయణపేట క్రాసింగ్‌ వద్ద మక్తల్‌ అఖిలపక్షం నాయకులు స్వాగతం పలికి అంబేద్కర్‌ చౌర స్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెంకట్‌రెడ్డిని పలువురు సన్మానించారు. కార్యక్రమంలో మక్తల్‌ పీసీసీ సభ్యులు శ్రీనివాస్‌గుప్తా, సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు బాలమల్లేష్, పశ్యపద్మ, మహ్మద్‌యూసుఫ్, సాయిలు, సృజన,  పండురంగాచారీ, బి.రాములు, అంజయ్యనాయక్, లక్ష్మీనారాయణ, పల్లె నర్సింహ, నల్ల శ్రావణి, రామక్రిష్ణ, ఏఐటీయూసీ నాయకులు కొండన్న,శాంతప్ప,  ఈశ్వర్, తాయప్ప, దత్తాత్రేయ, ఎం.నర్సిములు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top