
కాళేశ్వరం ప్రాజెక్టు ( ఫైల్ ఫొటో)
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును సోమవారం సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్ మసూద్ హుస్సేన్ సందర్శించారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలీకాప్టర్‌లో మేడిగడ్డ బ్యారేజీల పనులను వద్దకు చేరుకున్న ఆయన అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. నిర్మాణ పనులు, ప్రాజెక్టు గురించి హరీష్ మసూద్ హుస్సెన్‌కు వివరించారు.