‘వంశీ కుటుంబానికి సాయం అందిస్తాం’ | central minister sushma swaraj tweets on helps to telugu student vamsi reddy family | Sakshi
Sakshi News home page

‘వంశీ కుటుంబానికి సాయం అందిస్తాం’

Feb 13 2017 5:35 PM | Updated on Sep 5 2017 3:37 AM

‘వంశీ కుటుంబానికి సాయం అందిస్తాం’

‘వంశీ కుటుంబానికి సాయం అందిస్తాం’

వంశీరెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని సుష్మాస్వరాజ్‌ తెలిపారు.

న్యూఢిల్లీ: అమెరికాలో హత్యకు గురైన తెలుగు విద్యార్థి మామిడాల వంశీరెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని విదేశీ వ్యవహారాల శాఖమంత్రి సుష్మాస్వరాజ్‌ సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వంశీ కుటుంబానికి మంత్రి సుష్మా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అతని కుటుంబానికి తమ మంత్రిత్వ శాఖ సాయం అందిస్తుందని భరోసానిచ్చారు.  

( చదవండి : అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేత )

ప్రభుత్వ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని వంశీ కుటుంబానికి సుష్మా సూచించారు. భారత ఎంబసీ అధికారులు అందుబాటులో ఉంటూ సాయం చేస్తారని పేర్కొన్నారు. శాన్‌ఫ్రాన్సిస్‌కో లోని భారత అధికారుల నుంచి ఈ ఘటనపై నివేదిక అందిందని సుష్మా చెప్పారు. వంశీని కాల్చి చంపిన నిందితుడిని కాలిఫోర్నియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాలిఫోర్నియాలో ఎంఎస్‌ చేస్తున్న వరంగల్‌కు చెందిన వంశీరెడ్డి శుక్రవారం ఓ దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.  మాదక ద్రవ్యాలకు బానిసైన ఆ వ్యక్తి ఓ మహిళను బెదిరిస్తుండగా అడ్డుకోబోయిన క్రమంలో వంశీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement