
ముగ్గురు భారతీయులు మృతి
ఒకరికి గాయాలు.. ఇద్దరు గల్లంతు
కొచ్చి: మొజాంబిక్‌లో బెయిరా తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు చనిపోగా ఒకరు గాయపడ్డారు. ఈ ఘటనలో మరో ఐదుగురిని సిబ్బంది కాపాడారని అక్కడి భారత దౌత్య కార్యాలయం తెలిపింది. గురువారం సముద్రంలో నిలిపి ఉన్న ఓడలో మెయింటెన్స్ పనికోసం కొందరిని పడవలో పంపించారు. పడవ నుంచి ఓడను చేరుకునేందుకు ప్రయతి్నస్తుండగా తీవ్రమైన అలల తాకిడికి పడవ బోల్తా పడిందని భారత ఎంబసీ తెలిపింది.
ఘటన సమయంలో పడవలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని వివరించింది. అయితే, ప్రమాద బాధితుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనలో గల్లంతైన వారిలో ఇద్దరు మలయాళీలు కూడా ఉన్నట్లు కేరళ ఎమ్మెల్యే అనూప్ జాకబ్ శనివారం తెలిపారు. వీరిలో ఒకరు ఎర్నాకులం జిల్లా పిరవోమ్‌కు చెందిన ఇంద్రజిత్(22) కాగా, మరొకరు కొల్లమ్‌కు చెందిన వ్యక్తి అని ఆయన వివరించారు.