సాక్షి కార్టూనిస్టు శంకర్‌కు ఉత్తమ కళాకారుడి అవార్డు | Cartoonist Shankar to sakshi the best artist award | Sakshi
Sakshi News home page

సాక్షి కార్టూనిస్టు శంకర్‌కు ఉత్తమ కళాకారుడి అవార్డు

Jun 2 2015 12:48 AM | Updated on Aug 20 2018 8:20 PM

సాక్షి కార్టూనిస్టు శంకర్‌కు ఉత్తమ కళాకారుడి అవార్డు - Sakshi

సాక్షి కార్టూనిస్టు శంకర్‌కు ఉత్తమ కళాకారుడి అవార్డు

‘సాక్షి’ దినపత్రిక కార్టూనిస్టు పామర్తి శంకర్‌కు ఉత్తమ కళాకారుడి అవార్డు లభించింది.

అర్వపల్లి విలేకరి శ్రీరంగం వెంకన్నకు కూడా..

నల్లగొండ: ‘సాక్షి’ దినపత్రిక కార్టూనిస్టు పామర్తి శంకర్‌కు ఉత్తమ కళాకారుడి అవార్డు లభించింది. దశాబ్దాలుగా కార్టూనిజం వృత్తిలో రాణిస్తున్న శంకర్ తన సొంత జిల్లా అయిన నల్లగొండ నుంచి తెలంగాణ అవతరణ తొలి వార్షికోత్సవ సందర్భంగా ఈ పురస్కారానికి ఎం పికయ్యారు. ఆయనతో పాటు ‘సాక్షి’ దినపత్రిక అర్వపల్లి మండల విలేకరిగా పనిచేస్తున్న శ్రీరంగం వెంకన్నకు ఉత్తమ ఫొటో జర్నలిస్టు అవార్డును సోమవారం సాయంత్రం కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ప్రకటించారు.

ఇటీవల నల్లగొండ జిల్లా అర్వపల్లిలో సిమి ఉగ్రవాదులను తన కెమెరాలో సజీవం గా బంధించినందు కుగాను వెంకన్నకు ఈ అవార్డును ప్రకటించారు. వీరిద్దరికి మంగళవారం నల్లగొండలో జరిగే అవతరణ వేడుకల ఉత్సవాల్లో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పురస్కారంతోపాటు నగదు బహుమతి అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement