చోరీ ముఠా పట్టివేత | Capture theft gang | Sakshi
Sakshi News home page

చోరీ ముఠా పట్టివేత

Aug 22 2014 1:26 AM | Updated on Sep 2 2018 4:03 PM

చోరీ ముఠా పట్టివేత - Sakshi

చోరీ ముఠా పట్టివేత

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని చందనా బ్రదర్స్ షోరూమ్‌కు కన్నం వేసి బంగారు, వెండి నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లిన ముఠాను కూకట్‌పల్లి సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు.

  • షాపింగ్ మాల్స్ టార్గెట్ చేసుకొని రెచ్చిపోతున్న సోదరులు
  • ఐదుగురి నిందితుల అరెస్టు
  • నగలు, నగదు స్వాధీనం
  • గచ్చిబౌలి:  కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని చందనా బ్రదర్స్ షోరూమ్‌కు కన్నం వేసి బంగారు, వెండి నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లిన ముఠాను కూకట్‌పల్లి సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ డీసీపీ క్రాంతి రాణా టాటా గురువారం తెలిపిన వివరాలు ప్రకారం... ఈనెల 7వ తేదీ  తెల్లవారు జామున కేపీహెచ్‌బీలోని చందనా బ్రదర్స్‌లో చోరీ జరిగిన విషయం తెలిసిందే.  కూకట్‌పల్లి సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.  

    ఈ క్రమంలోనే గురువారం ఉదయం 6 గంటలకు కూకట్‌పల్లిలోని మలబార్ గోల్డ్ షాపు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న తూర్పుగోదావరి ఉడుద్రుపాకకు చెందిన కట్టా శివశంకర్ అలియాస్ లడ్డూ(26), ఇతనికి వరుసకు సోదరుడైన కట్టా సత్తిబాబు(24)లను అదుపులోకి తీసుకొని విచారించగా చందనాబ్రదర్స్‌లో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. చోరీ చేసిన నగలు, నగదు ఓల్డ్ అల్వాల్‌లో నివాసం ఉండే బంధువులు సోరంపుడి సత్యనారాయణ(50), కట్టా లక్ష్మి(40) చెల్లబోయిన వరలక్ష్మి(33)ల వద్ద దాచిపెట్టామని చెప్పడంతో వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15.50 లక్షల బంగారు, వెండి నగలు, రూ.5.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు.
     
    ఇలా చోరీ చేశారు...
     
    ఓల్డ్ అల్వాల్‌లో నివాసముంటున్న కట్టా శివశంకర్, దోమలగూడలో ఉంటున్న అతనికి సోదరుడైన కట్టా సత్తిబాబు(24) వారం రోజుల పాటు కూకట్‌పల్లిలోని చందనాబ్రదర్స్ వద్ద రెక్కీ నిర్వహించారు. ఈనెల 6వ తేదీ రాత్రి సెకండ్ షో సినిమాకు వెళ్లి వచ్చారు. రాత్రి 2 గంటలకు చందనాబ్రదర్స్ అనుకొని ఖాళీగా ఉన్న భవనంలోని టైపైకి వెళ్లారు. అక్కడి నుంచి లిఫ్ట్‌లోకి కన్నం పెట్టి.. చందనాబ్రదర్స్ లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.  ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా  కేసును ఛేదించినట్లు డీసీపీ వెల్లడించారు. చందనాబ్రదర్స్‌లో విలుైవె న నగలు ఉన్నప్పటికీ నిర్వాహకులు రాత్రి సమయంలో సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఉంచారు. వారి నిర్లక్ష్యంపై కేసు నమోదు చేస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా డీసీపీ సమాధానం దాటవేశారు.
     
    నిందితులపై 12 కేసులు...

     
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కట్టా శివశంకర్, కట్టా సత్తిబాబులపై 12 కేసులున్నాయని మాదాపూర్ డీసీపీ తెలిపారు.  షాపింగ్ మాల్స్, షాపులలో చోరీ చేయడంలో వీరిద్దరూ దిట్ట అని అన్నారు. రెక్కీ నిర్వహించి ఆ తర్వాత తెల్లవారుజామున 2 నుంచి ఉదయం 5 గంటల మధ్య చోరీ చేస్తారన్నారు.
     
    జైలు నుంచి పాయిపోయి వచ్చి...
     
    కట్టా శివశంకర్ 2006,2011, 2014లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పోలీసులు చోరీ కేసులో అరెస్ట్ చేశారు. 2007లో కాకినాడ-3 సీసీఎస్‌లో కేసు నమోదైంది.  2013లో అనపర్తి పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. 26 మే 2014లో రామచంద్రాపురం కోర్టులో హాజరు పరిచి వైజాగ్ సెంట్రల్ జైలుకు తీసుకెళుతుండగా కాకినాడ బస్ స్టాప్‌లో పోలీస్ ఎస్కార్ట్ కళ్లుగప్పి ఇద్దరూ పరారయ్యారు. అనంతరం నగరానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు.
     
    ఎల్బీనగర్‌లోని బిగ్ బజార్‌లో చోరీ యత్రించింది వీరేనని పోలీసులు తెలిపారు. విలేకరుల సమావేశంలో సైబ రాబాద్ క్రైం అడిషనల్ డీసీపీ జానకీ షర్మిల, ఏసీపీ రజినీ  పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement