తెలంగాణలో కెనడా ఫార్ములా: మందకృష్ణ

Canada Formula in Telangana : Mandakrishna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వందేళ్ల క్రితం అమలైన కెనడా ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని కేసీఆర్‌ కుట్ర పన్నారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కొంత మంది కార్మికులపై కాల్పులు జరిపించి ఉద్యమాన్ని పక్కదోవ పట్టించాలని చూశారని ఆరోపించారు. కానీ భయంతో ఆ ప్రణాళికలను అమలు చేయలేకపోయాడని విమర్శించారు. ‘కేసీఆర్‌, ఆయన భజనపరులకు నిన్నటి వరకు కాళేశ్వరం అక్రమ సంపాదనకు కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యింది. ఇప్పుడు కాళేశ్వరంపై కేంద్రం కన్ను పడడంతో కేసీఆర్‌ దృష్టి ఆర్టీసీపై పడింది. ఆర్టీసీ కార్మికుల నుంచి రాజకీయ పార్టీలను, ప్రజలను దూరం చేయాలని కేసీఆర్‌ కుట్ర చేశారు. ఆర్టీసీని నామరూపాలు లేకుండా చేయాలని కలలు కన్నార’ని విమర్శించారు.

ఇంకా మాట్లాడుతూ..  ‘సమాజం మద్దతును ఆర్టీసీ కూడగట్టుకుంది. సమస్య పరిష్కారమయ్యే వరకు వెనక్కి తగ్గొద్దు. ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన ఘనత కార్మికులదే. టీఎన్జీవో నాయకులు ఆర్టీసీ జేఏసీకి అండగా నిలవాలి. అంతేకానీ, కేసీఆర్‌కు వంత పాడి ఆర్టీసీ కార్మికులకు వెన్నుపోటు పొడవద్దు. సమ్మె మొదలైన నాటి నుంచి కోర్టు కార్మికుల పక్షానే నిలిచింది. కోర్టు హెచ్చరికల చివరి రూపమే సీఎస్‌ను, ఆర్టీసీ ఎండీని, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిని బోనులో నిలబెట్టింది. ఆర్టీసీ సమ్మె కేసీఆర్‌లో భయాన్ని పుట్టించింది. అందుకే కేవలం తొమ్మిది నిమిషాల్లో పరిష్కారమయ్యే సమస్యకు తొమ్మిది గంటలు కేటాయించి చర్చలు జరిపాడ’ని ఎద్దేవా చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top