ఘాట్‌రోడ్డుపై ఇరుక్కున్న బస్సులు | Buses on the narrow road | Sakshi
Sakshi News home page

ఘాట్‌రోడ్డుపై ఇరుక్కున్న బస్సులు

Mar 29 2018 8:41 AM | Updated on Mar 29 2018 8:41 AM

Buses on the narrow road - Sakshi

సారంగాపూర్‌(జగిత్యాల): సారంగాపూర్‌–బీర్‌పూర్‌ మండలాల మధ్య ఉన్న ఘాట్‌ రోడ్డుపై బుధవారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఇరుక్కున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. జగిత్యాల నుంచి జన్నారం వెళ్తున్న బస్సు, జన్నారం నుంచి జగిత్యాల వస్తున్న మరో బస్సు సారంగాపూర్‌ వైపు ఉన్న ఆంజనేయ ఆలయ సమీపంలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఒకదానికొకటి ఆనుకొనిపోయాయి. రెండు బస్సుల డ్రైవర్లు వెనక్కి తీసుకుని వారివారి గమ్యస్థానాలకు వెళ్లినట్లు కండక్టర్‌ సుంకరిపల్లి అశోక్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement